హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

BDK: పాల్వంచ పట్టణంలోని 31వ డివిజన్ పరిధిలోని మంచికంటి నగర్‌లో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం డివిజన్ కార్పొరేటర్ శ్యామల దినేశ్ ప్రారంభించారు.అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా నిరంతరం కృషి చేస్తామని కార్పొరేటర్ తెలిపారు.