హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాజుద్దీన్ కుటుంబానికి భారీ సాయం

ఖమ్మం దీక్షా దివస్ వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు మానవత్వం చాటుకున్నారు.గుండెపోటుతో మరణించిన మాజీ మైనారిటీ అధ్యక్షులు తాజుద్దీన్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ 5 లక్షలు, ఎంపీ రవిచంద్ర 2 లక్షలు, నామ నాగేశ్వరరావు 1.50 లక్షలు ఇచ్చారు. ఎమ్మెల్సీ తాత మధు, ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం తలో 50 వేలు అందించి భరోసా కల్పించారు.