హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు పూర్తి కాక ప్రయాణికులకు ఇక్కట్లు!

VKB: దౌల్తాబాద్ మండల పరిధిలోని బిచ్చాల్ గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటంతో గ్రామ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి నిర్మాణం కోసం కంకర పరచి పనులు చేపట్టినప్పటికీ, రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.