హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు

ASF: రెబ్బెన మండలంలోని నారాయణపూర్ గ్రామంలో పొలాలకు వెళ్లే దారిలో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. అటుగా వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి వేలాడుతున్న తీగలను సరిచేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.