హైదరాబాద్: 28°C
తెలంగాణ

నడిగూడెంలో ‘సండేస్ ఆన్ సైకిల్’ అవగాహన

SRPT: నడిగూడెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఈ రోజు ఎస్పీ సూచనల మేరకు, ఎస్సై తేజస్విని ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వ కార్యక్రమం నిర్వహించారు. 100వ ‘సండేస్ ఆన్ సైకిల్’ సందర్భంగా విద్యార్థులకు వ్యాయామం, ఆరోగ్యం, క్రమశిక్షణ ప్రాముఖ్యతను వివరించి, నిత్యం వ్యాయామం చేయాలని సూచించారు.