హైదరాబాద్: 28°C
తెలంగాణ

గచ్చిబౌలిలో ఘనంగా కార్తీక వనభోజనాలు

SRPT: జనార్దన్‌ హిల్స్‌ పార్క్‌లో కాలనీవాసుల ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హాజరయ్యారు. పవిత్ర కార్తీక మాసంలో అందరూ కలిసి వనభోజనాలు జరుపుకోవడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, వీరేంద్ర సిన్హా చీలా, మురళీకృష్ణ, సందీప్‌ రెడ్డి పాల్గొన్నారు.