హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వేములవాడ ఆలయ పార్కింగ్‌లో వాహనాల రద్దీ

వేములవాడ కార్తీక మాసం సందర్భంగా ఆదివారం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పార్కింగ్ స్థలం వాహనాలతో పూర్తిగా నిండిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా వేములవాడకు చేరుకున్నారు. దీంతో పార్కింగ్ ప్రదేశంలో కార్లు, ఇతర వాహనాలు కిక్కిరిసిపోయాయి. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.