హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా: సంపత్ కుమార్

GDWL: పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసాగా నిలుస్తుందని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. ఆదివారం ఎర్రవల్లి క్యాంపు కార్యాలయంలో వల్లూరు గ్రామానికి చెందిన బోయ మహేశ్‌కు మంజూరైన రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆయన అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తున్నారని తెలిపారు.