హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యమకారుల ఇచ్చిన హామీలు అమలు చేయాలి'

ఖమ్మం సబ్‌జైలు ఎదుట తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో దీక్ష దివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సోమయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా అర్హులకు న్యాయం చేయాలన్నారు.