హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాలన కష్టాలు.. అధికారుల కోసం ప్రజల ఎదురుచూపులు

MLG: కొత్తగా ఏర్పాటైన మల్లంపల్లి మండలంలో పూర్తిస్థాయి అధికారుల నియామకం లేక పాలనా సేవలకు ఆటంకం కలుగుతోంది. ఇంఛార్జ్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడంతో వివిధ పనులపై వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైన అధికారులు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.