హైదరాబాద్: 28°C
తెలంగాణ

మన్ కీ బాత్ వీక్షించిన శానంపూడి సైదిరెడ్డి

SRPT: బీజేపీ కార్యాలయం‌లో ప్రధాని మోదీ మన్ కీ బాత్ 140వ ఎపిసోడ్‌ను హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రధాని వివరించడం గర్వ కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి, కడియం రామచంద్రయ్య, మన్మధరెడ్డి, పండురంగాచారి తదితరులు పాల్గొన్నారు.