హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూపాలపల్లిలో ఘనంగా దీక్షా దివస్

BHPL: కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ చేపట్టి, తెలంగాణ తల్లి, అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలతో పాటు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అమరవీరుల త్యాగఫలితమే నేటి తెలంగాణ అని పేర్కొన్నారు.