హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ ఫ్రంట్ అధ్యక్షుడిగా మైసయ్య గౌడ్

SRPT: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు మునగాల మండల బీసీ ఫ్రంట్ అధ్యక్షుడిగా అనంతు మైసయ్య గౌడ్ నియమితులయ్యారు. ఆదివారం జిల్లా కమిటీల ఇన్‌చార్జి, బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ యాదవ్ ఆయనకు నియామక పత్రాన్ని మునగాలలో అందజేశారు.