SS: బుక్కపట్నం మండలంలోని బుచ్చయ్యగారిపల్లి, బుక్కపట్నం పోలింగ్ స్టేషన్లతో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. పోలింగ్ సరళి, క్యూలైన్లు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ర్యాంప్ సదుపాయాలను తనిఖీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్


