హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెన్నానదిలో వృథాగా పోతున్న నీరు

KDP: సిద్ధవటం ఆకులవీధిలోని పెన్నానదిలో ఏర్పాటు చేసిన మోటారు పైపుల నుంచి నీరు లీకేజీ అవుతూ వృథాగా పోతోంది. పైపులు తుప్పు పట్టి రంధ్రాలు ఏర్పడటంతో నిరంతరం నీరు బయటకు వస్తోంది. ప్రజలకు అందాల్సిన తాగునీరు వృథా అవుతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పాడైన పైపులను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.