హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రజా దర్బార్

అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యమని మంత్రి అన్నారు.