హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్నం 12 గంటలకు 61 శాతం ఓటింగ్ నమోదు!

BPT: చీరాల మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేగం పుంజుకుంది. పిట్టువారిపాలెం మినహా మిగిలిన 14 పంచాయతీల పరిధిలోని 189 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమకే ఓటు వేయాలని కోరుతున్నారు.