హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాదలలో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడులు

PLD: ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగి, ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడులకు దిగాయి. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.