NLR: ఆత్మకూరు మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రజలు ఓటు వేసేందుకు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 11 గంటల వరకు మండల వ్యాప్తంగా 70.3% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటిగంట లోపు ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మకూరులో ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలు


