హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్ల జిల్లాలో 11 గంటలకు 59.29 శాతం పోలింగ్

బాపట్ల జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు 96 పంచాయతీల్లో ఓటింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 9 గంటలకు 30.6 శాతం నమోదు కాగా, 11 గంటల సమయానికి 59.29 శాతానికి చేరింది. మొత్తం 1,74,590 మంది ఓటర్లు తమ ఓటు వేశారు.