హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

KKD: నేర నియంత్రణ లక్ష్యంగా వన్టైన్ CI మండల నాగదుర్గారావు రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, భూ వివాదాలు, జూదం, దౌర్జన్యాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఉపాధి పొందుతూ బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు. వారి కదలికలపై నిరంతర నిఘా ఉందని, మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని CI హెచ్చరించారు.