NZB: హమాల్వాడీలోని గిరిజన కళాశాలల బాలుర వసతిగృహంలో 120 మంది విద్యార్థులు కనీస వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. మంచాల కొరతతో నేలపైనే నిద్రిస్తుండగా, కిటికీలు, గదికి తలుపులు లేక చలితో అవస్థలు పడుతున్నారు. బోరు నీటితోనే స్నానాలు చేస్తున్నామని విద్యార్థులు వాపోయారు. అధికారులు స్పందించి అవసరమైన వసతులు కల్పించాలని కోరుతున్నారు.
తెలంగాణ
గిరిజన హాస్టల్లో వసతుల కరువు


