హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఐల బదిలీలకు రంగం సిద్ధం!

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో త్వరలో సీఐల బదిలీలు జరగనున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో మూడు, నాలుగు రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిపాలనా అవసరాలు, శాంతిభద్రతల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని పలువురు CIల స్థానాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.