హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మల్లయ్యకొండకు రేపు 4 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

అన్నమయ్య: మల్లయ్యకొండకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం సోమవారం ప్రత్యేకంగా నాలుగు ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు డీఎం వెంకటరమణారెడ్డి వెల్లడించారు. మదనపల్లి, రాగిమాను సర్కిల్, తంబళ్లపల్లి నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మల్లయ్యకొండకు వెళ్లే భక్తులు ఈ ప్రత్యేక బస్సు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.