హైదరాబాద్: 28°C
తెలంగాణ

JNTUH మహిళల వాలీబాల్ జట్టు ఎంపికలు

HYD: JNTUH క్యాంపస్‌లో మహిళల వాలీబాల్ జట్టు ఎంపికలు నిర్వహించారు. వివిధ కళాశాలల నుంచి 80 మంది క్రీడాకారిణులు ఈ ఎంపికల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 18 నుంచి 22 వరకు చెన్నైలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళల వాలీబాల్ ఛాంపియన్‌షిప్ లో ఎంపికైన జట్టు JNTUH తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.