KMM: దీక్షా దివస్ సందర్భంగా సత్తుపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి BRS రాష్ట్ర నాయకులు, మాజీ MLA సండ్ర వెంకట వీరయ్య ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, అమరవీరుల త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
అమరవీరుల త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి: మాజీ ఎమ్మెల్యే


