ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్దిగాంచిన భద్రకాళి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం ఆదివారం సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి అమ్మవారికి విశేష అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల సమక్షంలో ఉదయపు హారతి ఇచ్చారు. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. ఆలయం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది.
తెలంగాణ
భద్రకాళి మాతాకు ప్రత్యేక పూజలు


