హైదరాబాద్: 28°C
తెలంగాణ

భర్తపై అనుమానంతో కన్నబిడ్డలనే బలితీసుకున్న తల్లి

RR: కేశంపేట మండలం తొమ్మిదిరేకులలో విషాదం చోటుచేసుకుంది. భర్తకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గొడవపడిన శ్రీవర్ష, తన 8 నెలల కవలలు ప్రీతి, ప్రిన్సీలతో పాటు 2 ఏళ్ల కుమార్తె ప్రియను నీటి సంపులో పడేసి, తానూ దూకింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, తల్లి ప్రాణాలతో బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.