BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఆదివారం నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో నిత్య కళ్యాణ మండపానికి తీసుకువచ్చి వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
వైభవంగా రాముల వారి నిత్య కళ్యాణం


