హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

BHNG: దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం పెబ్బేరు సుభాష్ చౌరస్తాలో BRS నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష వల్లే రాష్ట్రం ఏర్పడిందని నాయకులు పేర్కొన్నారు. ఆయన పోరాటం, త్యాగాలను స్మరించుకుంటూ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.