హైదరాబాద్: 28°C
తెలంగాణ

జంగంపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

KMR: బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో శ్వాస చెస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి కృష్ణారావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు శ్వాసకోశ, ఛాతీ సంబంధిత వ్యాధులతో పాటు సీజనల్ వ్యాధులకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.