HYD: అనవసరంగా హారన్ మోగించడం వల్ల శబ్ద కాలుష్యం పెరగడమే కాకుండా, ఇతరులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే హారన్ ఉపయోగించాలని వారు వాహనదారులకు సూచించారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ద్వారా రహదారులను మరింత ప్రశాంతంగా, సురక్షితంగా మార్చడంలో సహకరించాలని 'X' వేదికగా పోలీసులు పిలుపునిచ్చారు.
తెలంగాణ
అనవసర హారన్ వద్దు.. బాధ్యతగా డ్రైవ్ చేయండి


