హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాట్రియాల్ శివాలయంలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

MDK: రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామ శివాలయం 15వవార్షికోత్సవం సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాజరాజేశ్వరస్వామి ఆలయం నుంచి మంగళవాయిద్యాలు, శివనామస్మరణ మధ్య ధ్వజస్తంభాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ఆదివారం తెల్లవారుజామున ప్రతిష్ఠించారు. గ్రామస్తులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.