హైదరాబాద్: 28°C
తెలంగాణ

SLV వైన్స్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

VKB: యాలాల మండల కేంద్రంలోని SLV వైన్స్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో యాలాల గ్రామానికి చెందిన బోయిని హరీశ్ (21)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI విఠల్‌రెడ్డి తెలిపారు. ఈనెల 24న రాత్రి వైన్స్‌లో చొరబడి నగదు, మద్యం బాటిళ్లు దొంగిలించినట్లు వెల్లడించారు. గతంలోనూ ఇదే వైన్స్‌లో చోరీ జరగడం గమనార్హం.