హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద కుటుంబాలకు CMRF అండ: మంత్రి సీతక్క

ములుగు జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మల్లంపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు మంత్రి సీతక్క ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులు పంపిణీ చేశారు. వైద్య ఖర్చులు భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు CMRF అండగా నిలుస్తోందని, అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.