MLG : కన్నాయిగూడెం మండలం చింతగూడెం గ్రామ యువతకు కాంగ్రెస్ నాయకులు వాలీబాల్ నెట్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అల్లెం అనిత, సునార్కని రాంబాబు, గోస్కుల నవీన్, బైరవైన రమేష్‌కు యువత కృతజ్ఞతలు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని మండల కోఆర్డినేటర్ దుర్గం ప్రభాకర్ అన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని కోరారు.
తెలంగాణ
యువతకు వాలీబాల్ నెట్ అందజేత


