హైదరాబాద్: 28°C
తెలంగాణ

బిల్లుల పెండింగ్‌తో గాంధీ హాస్టల్ పనులు ఆలస్యం

HYD: గాంధీ మెడికల్ కాలేజీలో రూ.80కోట్లతో చేపట్టిన వైద్యుల, విద్యార్థుల వసతి గృహాల నిర్మాణ పనులు తుదిదశలో మందగించాయి. 2026 ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సిన పనులు ఇంకా కొనసాగుతుండటంతో వైద్యులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 3చోట్ల చేపట్టిన ఈ నిర్మాణాలు పూర్తైతే మహిళా పీజీలకు 384, ఇతర వైద్యులకు, విద్యార్థులకు మరో 250 మందికి వసతి కలగనుంది.