హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థిపై ఉపాధ్యాయుడి బెత్తం దెబ్బలు

MBNR: నవాబ్ పేట మండలం లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థి రాఘవేందర్‌ను హిందీ ఉపాధ్యాయుడు ప్రవీణ్ కుమార్ గౌడ్ బెత్తంతో కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో విద్యార్థి వీపు, చేతులపై గాయాల గుర్తులు ఏర్పడటంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.