BDK: నిర్మాణంలో ఉన్న కొత్తగూడెం విమానాశ్రయానికి మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు పెట్టాలని అంబేడ్కర్ యూత్ అసోసియేషన్ (ఏవైఎస్) డిమాండ్ చేసింది. రామన్నపేట గ్రామంలో ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని ఫూలే చాటారని వక్తలు గుర్తుచేశారు. ఆయన పేరు పెట్టడమే నిజమైన గౌరవమని, ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.
తెలంగాణ
కొత్తగూడెం ఎయిర్పోర్టుకు ఫూలే పేరు?


