MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రోడ్డు డివైడర్ లేకపోవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జన్నారం 4 జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులో ఉంది. దీంతో నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధాన రహదారిపై రోడ్డు డివైడర్ లేకపోవడంతో వాహనాల వేగంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం రోడ్డు డివైడర్ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్ డివైడర్ లేక ఇబ్బందులు


