NRML: భైంసా మండలం పెండ్పెల్లిలో శ్రీనిధి రుణాల వసూళ్లలో అక్రమాలు జరిగాయని మహిళలు ఆరోపిస్తున్నారు. రూ.లక్ష రుణానికి నెలకు రూ.2,100 వాయిదా చెల్లించాల్సి ఉండగా, ఒక్కో సభ్యురాలి నుంచి రూ.3,100 వసూలు చేశారని బాధితులు వాపోయారు. శనివారం విచారణకు వచ్చిన అధికారులను గ్రామస్థులు నిలదీశారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
శ్రీనిధి రుణాల వసూళ్లలో అక్రమాలు


