హైదరాబాద్: 28°C
తెలంగాణ

వడ్లు కొనండి మహాప్రభో.. రైతుల పడిగాపులు

SRD:​ అందోల్ మండలం నేరడిగుంటలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేరడిగుంట-బ్రహ్మణపల్లి, జోగిపేట రహదారులపై వారం రోజులుగా ధాన్యం బస్తాల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో కాంటాలు వేయకపోవడంతో వడ్లు వర్షానికి తడిసిపోయాయని వాపోయారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని కోరారు.