హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 1న వికారాబాద్‌కు గవర్నర్ రాక

VKB: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా డిసెంబర్ 1న వికారాబాద్‌కు రానున్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ పర్యటనతో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.