హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం

PDPL: పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి రథోత్సవం (జాతర) ఘనంగా నిర్వహించనున్నారు. స్వామివారి రథోత్సవం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు గ్రామం నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తుల తరలిరానున్నారు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య రథోత్సవం వైభవంగా సాగనుంది.