హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ట్రేడ్ లైసెన్సులపై అధికారులు దృష్టి

WNP: పట్టణంలో నివాస గృహాలుగా నమోదు చేసి హోటళ్లు, హాస్టళ్లు, దుకాణాలు, ఆస్పత్రులు నిర్వహిస్తున్నా నివాస పన్నులే చెల్లిస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతోంది. పట్టణంలో 4 వేల దుకాణాలు ఉండగా, 1,700 మాత్రమే ట్రేడ్ లైసెన్సులు కలిగి ఉన్నాయి. వాణిజ్య భవనాలను గుర్తించి కమర్షియల్ పన్నులు విధిస్తామని మున్సిపల్ మేనేజర్ శంకర్ తెలిపారు.