హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవోదయ పరీక్షకు 462 మంది గైర్హాజరు

VKB: జిల్లాలో శనివారం నిర్వహించిన నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష కోసం జిల్లావ్యాప్తంగా మొత్తం 1,656 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,194 మంది పరీక్షకు హాజరయ్యారు. మిగిలిన 462 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.