హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళం వేసిన ఇళ్లలో చోరీ.. నిందితులు అరెస్ట్

MDCL: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి నిందితులను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం పూట రెక్కీ నిర్వహించి రాత్రి సమయాల్లో తాళాలు వేసిన ఇళ్లలో చోరీ చేసేవారు. వారి నుంచి రూ. 3.50 లక్షల నగదు 103.89 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ACP రమేశ్ కేసు వివరాలు వెల్లడించారు.