SRCL: ఇల్లంతకుంట మండలం జంగంరెడ్డిపల్లికి చెందిన పరిపెల్లి సులోచన (65) శనివారం ఉదయం ఇంటి సంపులో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. భర్త శ్రీనివాస్‌రెడ్డి మరణం తర్వాత ఆమె ఇంటి వద్ద ఉంటుండగా, పెంపుడు కుమారుడు బాగోగులు చూసుకుంటున్నాడు. ఘటనను గమనించిన అతను గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. పంచాయతీ కార్యదర్శి మధు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
సంపులో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి


