NRPT: తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న ఖేలో ఇండియా క్రీడలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియాన్ని శనివారం సందర్శించిన ఆయన క్రీడా ప్రాంగణాలు, మౌలిక సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
'ఖేలో ఇండియా క్రీడలకు పకడ్బందీ ఏర్పాట్లు'


