హైదరాబాద్: 28°C
తెలంగాణ

నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం

SRCL: ఎల్లారెడ్డిపేట పెద్దబడి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థి, ఎన్నారై బొమ్మకంటి సతీష్ కుమార్ గుప్తా రూ.10 వేల నగదు ప్రోత్సాహకం అందించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచి, ఉన్నత లక్ష్యాలు సాధించేలా ప్రోత్సహించడమే తన ఉద్దేశమని తెలిపారు.